శరీర సౌష్టవం

జీవనశైలిని ప్రస్పుటంగా దిశానిర్దేశం చేయగల మరొక సాధనం శరీర సౌష్టవ గణాంకం. మనిషి ఎత్తు లింగం బట్టి, పెద్ద, మధ్యమ, చిన్న శరీర సౌష్టవం కలవారు ఎంత బరువు ఉండాలో తెలియ చేస్తుంది. మణికట్టు చుట్టుకొలతలను, పొడవుతో గుణించగా వచ్చిన విలువను ప్రామాణిక విలలువలతో పోల్చుకొని మన ఎలాటి శరీర సౌష్టవం కలిగిన వారమో నిర్థారించుకోవచ్చు. అదే విధంగా కుడి మోచేయి గుండ్రని ఎముక పార్శ్వ రెండు ఉబుకుల మధ్య దూరం సెం. మీలలో కొలచి, దానిని పట్టికలొ ఇవ్వబడిన ప్రామాణిక విలువలతో పోల్చుకొని వయస్సు , పొడవును బట్టి కూడా శరీర సౌష్టవం తెలుసుకోవచ్చు.

cm (or) Feet Inchesశరీర సౌష్టవం తెలుసుకోవడం

a) మణికట్టు చుట్టుకొలతను బట్టి: శరీర పొడవును (సెం. మీ) కొలచి, దానిని కుడి చేతి మణికట్టు చుట్టుకొలతతో(సెం. మీ) భాగించగా వచ్చిన విలువను పట్టికలొ ఇవ్వబడిన విలువలతో పోల్చుకొని శరీర సౌష్టవం నిర్ణయించుకోవాలి

శరీర సౌష్టవ పరిమాణం(r)= పొడవు(సెం. మీ)/మణికట్టు చుట్టుకొలత(సెం. మీ)

  చిన్న శరీర సౌష్టవము మధ్యస్థ శరీర సౌష్టవము పెద్ద శరీర సౌష్టవము
పురుషులు > 10.4 10.4 – 9.6 < 9.6
స్త్రీలు > 10.9 10.9 – 9.9 < 9.9

b)మోచేయి వెడల్పును బట్టి: బొమ్మలో చూపించిన విధంగా కుడి మోచేయి గుండ్రని ఎముక పార్శ్వ రెండు ఉబుకుల మధ్య దూరం (సెం. మీ) కొలచి, దానిని పట్టికలొ ఇవ్వబడిన విలువలతో పోల్చుకొని వయస్సును బట్టి , పొడవును బట్టి శరీర సౌష్టవం నిర్ణయించుకోవాలి.

మీ మోచేయి కొలత క్రింద చూపబడిన

పరిధి కంటె తక్కువయితే : చిన్న శరీర సౌష్టవము
పరిధిలో ఉంటే : మధ్యస్థ శరీర సౌష్టవము
పరిధి కంటె ఎక్కువయితే: పెద్ద శరీర సౌష్టవము

వయస్సును బట్టి శరీర సౌష్టవ పరిమాణం

వయస్సు(సం.లలో) మోచేయి వెడల్పు పరిధి(సెం. మీ)
స్త్రీలు పురుషులు
18 -24 5.7 – 6.4 6.7 – 7.6
25 – 34 5.8 – 6.7 6.8 – 7.8
35 – 44 5.8 – 7.0 6.8 – 8.0
45 – 54 5.8 – 7.1 6.8 – 8.0
55 – 64 5.9 – 7.1 6.8 – 8.0
65 - 74 5.9 – 7.1 6.8 – 8.0

పొడవును బట్టి శరీర సౌష్టవ పరిమాణం

  పొడవు(సెం. మీ) మోచేయి వెడల్పు పరిధి(సెం. మీ)
పురుషులు 158 – 161 6.4 – 7.2
  162 – 171 6.7 – 7.4
  172 – 181 6.9 – 7.6
  182 – 191 7.1 – 7.8
  192 – 193 7.4 – 8.1
స్త్రీలు 148 – 151 5.6 – 6.4
  152 – 161 5.8 – 6.5
  162 – 171 5.9 – 6.6
  172 – 181 6.1 – 6.8
  182 - 183 6.2 – 6.9

ప్రామాణిక శరీర సౌష్టవ పట్టిక (LIC వారు రూపొందించినది)

పొడవు
సెం.మీ లలో
25 నుంచి 59 సంవత్సరముల వయస్సు వారికి మాత్రమే
స్త్రీలు పురుషులు
చిన్న శరీర సౌష్టవము (కి.గ్రా.లలో) మాధ్యమిక శరీర సౌష్టవము (కి.గ్రా.లలో) పెద్ద శరీర సౌష్టవము (కి.గ్రా.లలో) చిన్న శరీర సౌష్టవము (కి.గ్రా.లలో) మాధ్యమిక శరీర సౌష్టవము (కి.గ్రా.లలో) పెద్ద శరీర సౌష్టవము (కి.గ్రా.లలో)
149 47.2-50.4 49.9-53.5 53.1-57.6      
152 47.6-51.3 50.8-54.4 54.0.58.5      
155 48.5-52.2 51.7-55.3 54.9-59.4      
157 49.9-53.5 53.1-56.7 56.2-61.2 52.6-56.7 56.2-60.3 59.4-64.4
160 51.3-54.9 54.4-58.1 57.6-62.6 54.0-58.1 57.6-61.7 60.3-65.3
163 52.6-56.7 56.2-59.9 59.4-64.4 55.3-59.9 59.0-63.5 62.2-67.6
165 54.0-58.1 57.6-61.2 60.3-65.8 57.2-61.7 60.8-65.3 64.0-69.4
168 55.8-59.9 59.0-63.5 62.6-68.0 58.5-63.1 62.2-66.7 65.8-712
170 57.2-61.7 60.8-65.3 64.4-69.9 60.3-64.9 64-0-68.5 67.6-73.5
173 58.5-63.1 62.2-66.7 65.8-71.7 61.7-66.7 65.8-70.7 69.4-75.3
175 60.3-64.9 64.0-68.5 67.6-73.5 63.5-68.5 67.6-72.6 71.2-77.1
178 61.7-66.7 68.8-70.3 69.0-75.3 65.3-70.3 69.4-74.4 73.0-79.4
180 63.1-68.0 67.1-71.7 70.3-76.7 67.1-72.1 71.2-76.2 74.9-81.7
183       69.0-74.4 73.0-78.5 76.7-83.9
185       71.2-76.7 75.3-80.7 78.9-86.2
188       73.9-79.4 77.6-83.5 81.2-88.9
190       76.2-81.7 79.8-85.7 83.5-91.6